NZB: జిల్లాలో ధాన్యం రంగు మారిందంటూ ప్రైవేటు వ్యాపారులు ధరలు తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. గతంలో క్వింటాకు రూ.3,400–3,800 చెల్లించగా, ప్రస్తుతం రూ.2,700–2,800 మాత్రమే ఇస్తున్నారు.ఆర్మూర్, వేల్పూర్, జక్రాన్పల్లి, ఇందల్వాయి, (M)లో కొనుగోళ్లు తగ్గడంతో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతునన్నారు.
తెలంగాణ
వ్యాపారుల దోపిడీతో రైతుల ఆవేదన


