ఏఐ రాకతో ఫార్మా రంగం పనితీరు మారిపోయింది. గతంలో వారాలు పట్టే పనులను ఇప్పుడు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. ఔషధ పరిశోధనలో లక్ష్యాల గుర్తింపు, క్లినికల్ డేటా విశ్లేషణ, నియంత్రణ పత్రాల తయారీలో ఏఐ వాడకం పెరిగింది. దీంతో శాస్త్రవేత్తలు, ఫార్మకాలజిస్టులు, బయోస్టాటిస్టిషియన్లు, డేటా సైంటిస్టులు, ఏఐ నిపుణులకు కొత్త అవకాశాలు రావడంతో పాటు, విద్యా సంస్థలు-కంపెనీల భాగస్వామ్యాలూ పెరుగుతున్నాయి.
వార్తలు
ఏఐతో మారుతున్న ఫార్మా పనితీరు!


