హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూజలతో డబ్బు రెట్టింపు చేస్తామని మోసం.. ముఠా అరెస్ట్

ADB: పూజలతో డబ్బులను రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రవెల్లి (మం) గిన్నెరకు చెందిన పరశురాం, బక్కన్న మరో ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. ఇచ్చోడకు చెందిన రాజుతో పరిచయం పెంచుకుని పూజల ద్వారా డబ్బులను రెట్టింపు చేస్తామని నమ్మించారు. ఈనెల 19న రూ.3 లక్షలను తీసుకొని కారులో పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.