హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధురాలిపై అత్యాచారం.. ఫోన్ తీసుకొని పరార్!

HYD: బంజారాహిల్స్‌లో దారుణ ఘటన కలవర పెడుతోంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఆమెను వెంబడించి చంపేస్తానని బెదిరిచి అక్కడే ఖాళీ స్థలంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసుల ముందు బోరుమంది. అనంతరం ఫోన్ లాక్కొని పరార్ అయ్యాడని వాపోయింది.