హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు పోలీసుల చైతన్య కార్యక్రమం

MDK: రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కన్నపేట పీఎం శ్రీ హైస్కూల్‌ లో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, పోక్సోచట్టం, డ్రగ్స్ దుష్ప్రభావాలు, అత్యవసర డయల్ 112 సేవలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.