హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలి'

SRCL: వేములవాడ పట్టణంలో విలీనమైన శాత్రాజ్‌పల్లి గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలని, లేదంటే గ్రామ పంచాయతీలను తిరిగి అప్పగించాలని జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీ ఉంటుందన్నారు.