హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

యూపీ కన్నౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఆగి ఉన్న పాఠశాల బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా  గాయపడ్డారు. వీరంతా తాజ్ మహల్ విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.