హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయం కోసం దీక్షకు దిగిన మహిళా ప్రొఫెసర్ అరెస్ట్

HYD: వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మహిళా ప్రొఫెసర్ ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మహిళా ప్రొఫెసర్ తేజశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా, న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలినే అరెస్ట్ చేయడంపై పలువురు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.