హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్‌లో నేడు నూతన కోర్టు ప్రారంభం

MDK: తూప్రాన్ పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంగళవారం ఉదయం 11 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి, మెదక్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సుద్దాల చలపతిరావు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా జడ్జి నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఏర్పాటుతో స్థానికులకు న్యాయసేవలు చేరువ కానున్నాయి.