హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వాంగ సుందరంగా సర్దార్‌ పటేల్‌ స్టేడియం

KMM: నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం దశ తిరిగింది. ఖేలో ఇండియా క్రీడల కోసం మొత్తం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సదుపాయాల కల్పనకు ఖమ్మం కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధర్యంలో రూ.1.86 కోట్లను కేటాయించారు. గడువు తేదీలోగా పనులు పూర్తి చేయనున్నారు. కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ఈఈ క్రిష్ణలాల్‌లు నిరంతరం ఆయా పనులను పర్యవేక్షిస్తున్నారు.