గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. జెట్‌పూర్ సమీపంలో ధాసా-జెటల్సర్ బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ దాటుతున్న రెండు ఆడ సింహాలను రైలు ఢీ కొట్టడంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సింహాల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ప్యాసింజర్ రైలు ఢీకొని రెండు సింహాల మృతి


