HNK: కాజీపేట మండలం మడికొండలోని ప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
మెట్టుగుట్టపై భక్తి శ్రద్ధలతో కార్తీకమాసం పూజలు


