హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తుల కొంగుబంగారంగా రామలింగేశ్వరుడు

BHNG: నారాయణపూర్ మండలంలోని చిల్లాపురం గ్రామంలో స్వయంభూ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున మాత్రమే ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకలకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 20 వేలకు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.