BDK: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 26న కొత్తగూడెం రానున్నారు. స్థానికంగా జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు AP CMO ప్రకటించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 3.30 గంటలకు కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
ఈనెల 26న కొత్తగూడెం రానున్న ఏపీ సీఎం


