హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెమ్మ తల్లి ఆలయంలో చోరీ

E.G: రాజమండ్రిలోని ఏడీబీ రోడ్డు పక్కన పొలిమేరల మధ్య ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుణపాలతో తాళాలు పగులగొట్టి హుండీలోని నగదు, ఇత్తడి పళ్లాలు, దీపపు కుందులు, అమ్మవారి చీరలను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలు నిలిపివేసి పెదరాయవరం-కోటపాడు గ్రామ బ్యాటరీని సైతం అపహరించినట్లు వీర సత్యనారాయణ తెలిపారు.