హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సాపూర్ అడవిలో కారు ధ్వంసం

MDK: నర్సాపూర్ పట్టణ శివారులోని హైదరాబాద్ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిపై ముగ్గురు కలిసి దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నారాయణపూర్ గ్రామానికి చెందిన అక్బర్‌పై దాడికి యత్నించడంతో పాటు, ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రదీప్ గౌడ్, రోహిత్, అరుణ్ గౌడ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.