BHNG: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు. రద్దీకి అనుగుణంగా వ్రత మండపంలో బ్యాచ్‌ల వారీగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. శివాలయంలో స్ఫటిక లింగానికి భక్తులు అభిషేకాలు చేస్తున్నారు.
తెలంగాణ
యాదగిరిగుట్టలో పోటెత్తిన భక్తజనం


