హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రైనీ డీఎస్పీలకు ఎస్పీ సూచనలు

NRPT: జిల్లాలో ప్రాక్టికల్ శిక్షణకు కేటాయించిన ముగ్గురు ట్రైనీ డీఎస్పీలకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ IPS దిశానిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని ఆసక్తిగా నేర్చుకుని, చట్టాలు, విధులపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలని సూచించారు.