హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

NLG: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పర్వదినాలు ప్రతి ఇంటా ఆనందం, సిరిసంపదలు నింపాలని, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. పండుగలను కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు.