KMM: తిరుమలాయపాలెం మండలం జూపెడ–చోటపల్లి రహదారిపై ఎస్సీ కాలనీ సమీపంలోని కల్వర్టు ప్రమాదాలకు నిలయంగా మారింది. కల్వర్టును వెడల్పు చేయకపోవడం, ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువతులు ప్రమాదానికి గురికాగా, ఒకరికి చేయి విరిగింది. అధికారులు స్పందించి రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదాలకు నిలయంగా జూపెడ కల్వర్టు


