హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తిన భక్తులు

రంగారెడ్డి: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. సహజసిద్ధంగా ప్రవహించే పవిత్ర జలధార ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. 15 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.