SRD: సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర పాఠశాలల్లో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రోహిణి ఆదేశించారు. ఉదయం ప్రార్థన వేళలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి రాజ్యాంగ పీఠికను చదవాలని అన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం వేడుకలు


