హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేందర్ రెడ్డి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

SRCL: ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన కస్తూరి మహేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆపద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.