హైదరాబాద్: 28°C
తెలంగాణ

25 రోజులుగా ఒకేచోట పోలీస్ కారు!

MBNR: జడ్చర్ల పాత బస్టాండ్ నుంచి బాదేపల్లి పాత బస్టాండ్ వెళ్లే ప్రధాన రహదారిలో మటన్ మార్కెట్ పక్కన TS 07 HM 9983 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు 25 రోజులుగా ఒకేచోట నిలిపి ఉంచారు. కారుపై పోలీస్ అని రాసి ఉండటంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.