హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భీంగూడలో TAGS మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న TAGS రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకుడు దినకర్ పిలుపునిచ్చారు. వాంకిడి మండలం భీంగూడలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. గిరిజన గూడేల్లో నెలకొన్న రోడ్లు, విద్య, మౌలిక సదుపాయాల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. 28న జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.