హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక దీపాలతో శోభాయమానంగా శివాలయాలు

MHBD: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శివాలయాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడాయి. శివుడికి ప్రీతికరమైన ఈ రోజున అభిషేకాలు చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే మహిళలు, చిన్నారులు ఆలయాలకు తరలివచ్చి.. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు