హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

నల్గొండ కార్పొరేషన్ 5వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి గణేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివాలయం సమీపంలో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.