హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెర్వుగట్టులో గిరిప్రదక్షిణకు సన్నాహాలు

NLG: ప్రముఖ శైవక్షేత్రం చెర్వుగట్టులో యాదాద్రి తరహాలో గిరిప్రదక్షిణ ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే నెల అమావాస్య నుంచి ప్రారంభించే యోచనతో ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు గుట్ట చుట్టూ ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో మోహన్‌ తెలిపారు.