హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తజన సందోహంతో కొండగట్టు కళకళ

JGL: కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది . ఇవాళ ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం గిరిప్రదక్షిణ చేస్తూ.. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.