BHPL: కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దీంతో శివాలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
తెలంగాణ
కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు భక్తుల తాకిడి


