హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరం

NRML: నిర్మల్ మండలం రత్నాపూర్-కాండ్లి నుంచి లక్ష్మ ణచాంద మండలం వడ్యాల్ గ్రామం వరకు ఉన్న కంకర రోడ్డుపై ప్రయాణం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దాదాపు మూడు కిలోమీటర్ల రోడ్డు బాగు చేయడానికి కంకర వేసి వదిలేయడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు నానా యాతన పడుతున్నారు. కంకర తేలడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే బీటీ రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.