హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మధ్యలోనే నిలిచిన మున్సిపల్ భవన నిర్మాణం

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో TUFIDC నిధులు రూ.4 కోట్లతో 2023లో శంకుస్థాపన చేసిన నూతన భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. చుట్టూ ముళ్లపొదలు పెరిగి భవనం పాడుబడుతోంది. కార్యాలయం ప్రారంభం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.