NLG: అగ్రిగోల్డ్ బాధితులకు నగదు తిరిగి చెల్లింపు ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి బాండ్ల పరిశీలన చేపట్టనున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బాండ్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. మండలాల వారీగా కేటాయించిన తేదీల్లో రోజుకు 250 మంది బాధితుల బాండ్లను పరిశీలిస్తామని తెలిపారు.
తెలంగాణ
రేపటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన!


