హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

NRPT: మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో కృష్ణ మండల పరిధిలోని గుడెబల్లూర్ గ్రామంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, శుక్లాలు ఉన్న వారిని గుర్తించి ఉచిత ఆపరేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని వృద్ధులు, కంటి సమస్య ఉన్నవారు సద్వినియం చేసుకోవాలని కోరారు.