హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్కల దాడి.. పలువురికి తీవ్ర గాయాలు

GDWL: గద్వాల పట్టణంలోని చింతలపేటలో మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ పలువురిపై దాడి చేశాయి. ఈ ఘటనలో బాధితుల చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల బెడద నివారించాలని కౌన్సిలర్ ముత్యాల లక్ష్మి తనయుడు రవిరెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.