హైదరాబాద్: 28°C
వార్తలు

స్టాలిన్‌తో ఈపీఎస్ ఫొటో.. రాజకీయ దుమారం

తమిళనాడు మాజీ సీఎంలు స్టాలిన్, పళనిసామి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఒక ఫొటో రాజకీయంగా కలకలం రేపుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో సూపర్ స్టార్ రజనీతో కలిసి స్టాలిన్, పళనిసామి కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో DMK, AIDMK మధ్య పొత్తు కుదిరినట్లు చర్చ జరుగుతోంది. విజయ్ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని ఇటీవల స్టాలిన్ అనడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.