తిరుపరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగంచే అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇవాళ దీపం వెలిగించేందుకు హిందూ ధర్మ పరిషత్ సిద్ధమవుతోంది. మరోవైపు కలెక్టర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో దీపం వెలిగించే విషయం ఉత్కంఠగా మారింది.
వార్తలు
దీపం వివాదం.. తమిళనాట బిగ్ టెన్షన్


