శబరిమలలో అయ్యప్ప స్వామి తీర్థయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 40 పాములను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సర్పాలను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని ఆలయ పరిసరాలకు సుమారు 3 కి.మీ దూరంలోని అంబలక్కడవు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలిపారు. వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు.
వార్తలు
శబరిమలలో 40 పాముల పట్టివేత


