హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షేత్రస్థాయి శిక్షణకు నలుగురు డీఎస్పీలు

NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 నెలల పాటు శిక్షణ పొందేందుకు వచ్చిన నలుగురు ప్రొబెషనరీ DSPలు సోమవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిసి రిపోర్ట్ చేశారు. పోలీస్ పరిపాలన, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాలు, మహిళలు, బాలల భద్రత తదితర అంశాలపై క్షేత్రస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని కమిషనర్ సూచించారు.