NZB: నగరంలోని కంఠేశ్వర్‌లోని చారిత్రక నీలకంఠేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఎండు గడ్డి, కొబ్బరి ఆకులతో ఏర్పాటు చేసిన తోరణాన్ని వెలిగించి భక్తులు హరహర మహాదేవ నామస్మరణతో దాని కింద నుంచి నడిచి వెళ్లారు. జ్వాలా తోరణం దాటితే పాపాలు తొలగి, పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
తెలంగాణ
నీలకంఠేశ్వరాలయంలో జ్వాలా తోరణం


