హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ బైక్ వివాదం.. ఎస్‌ఐపై సస్పెండ్

SRPT: హుజూర్‌నగర్ ఎస్‌ఐ చలికంటి నరేష్ సస్పెండ్ అయ్యారు. మవనస్థలిపురంలో చోరీకి గురైన బుల్లెట్ బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు హుజూర్‌నగర్ స్టేషన్‌లో అప్పగించగా, స్థానికుల ఒత్తిడితో మరో వ్యక్తికి తిరిగి ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ప్రాథమిక విచారణ అనంతరం సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.