MLG: ములుగు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. పట్టణంలోని లోకం చెరువు కాలువ కట్టపై ఉన్న వీవర్స్ కాలనీలో 7, 19వ వార్డుల మురుగునీటి మళ్లింపు కోసం కాలువలు తవ్వారు. అయితే.. పనులు మధ్యలోనే ఆపేసి పైపులు వేయకుండా, తవ్విన గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేశారు. దీంతో పంటలు చేతికొచ్చే కీలక సమయంలో పొలాలకు వెళ్లే దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అధికారులకు విన్నవించిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
కాలువ తవ్వి వదిలేశారు.. రైతుల గోడు పట్టదా?


