హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తులతో కిటకిటలాడిన శివాలయం

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేస్తూ భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.