హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

JN: కార్తీక పౌర్ణమి సందర్భంగా పాలకుర్తి స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే దర్శనానికి బారులుతీరారు. మహిళలు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. సాయంత్రం నిర్వహించనున్న అఖండ జ్యోతి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.