BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చండీ హోమం, జలతోరణం, లింగార్చన, ఆకాశదీపం పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు


