హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి ఆలయంలో నేడు జ్వాలాతోరణ వేడుకలు

WGL: వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానం కార్తీక పౌర్ణమి వేడుకలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు భద్రకాళీ సమేత భద్రేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరారు.