హైదరాబాద్: 28°C
వార్తలు

ఒవైసీకి సెల్యూట్‌ చేయించిన అధికారి బదిలీ

యూపీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గౌరవ వందనం పొరపాటు ఎంఐఎం అధినేత ఓవైసీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు ఓవైసీకి సెల్యూట్ చేయించిన సంబంధిత పోలీసు అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. సదరు సీఐని ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.