NRML: బాసర గోదావరి ఘాట్‌లో సోమవారం సాయంత్రం స్నానం చేస్తున్న మహిళ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా విధుల్లో ఉన్న సిబ్బంది గమనించి వెంటనే నీటిలోకి దూకి ఒడ్డుకు చేర్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామానికి చెందిన బండమీది భోజమ్మను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆమె కుమారుడు నరేందర్ చేరుకున్నారు. సిబ్బందిని భక్తులు అభినందించారు.
తెలంగాణ
బాసర గోదావరి ఘాట్‌లో మహిళకు రక్షణ


