హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎం రాహత్ పథకాన్ని వినియోగించుకోవాలి: ఎస్సై

KMR: పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నస్రుల్లాబాద్ ఎస్సై సాయికృష్ణ సూచించారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 112కు ఫోన్ చేయాలని, 48 గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకోవాలని సూచించారు.