హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ శివాలయంలో డీసీపీ దంపతుల ప్రత్యేక పూజలు

JN: కార్తీక మాసం సందర్భంగా జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వెస్ట్ జోన్ DCP రాజమహేంద్ర నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత ఆలయ ఆవరణలో నిర్వహించిన శివపార్వతుల పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆకాశ జ్యోతిని వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.